పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన తోట త్రిమూర్తులు

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన తోట త్రిమూర్తులు

తన మిత్రులైన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ అవంతి శ్రీనివాస్... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడంతో.. ఇక రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఆమంచి వైసీపీలో చేరడానికి ముందు తోట త్రిమూర్తులును కలవడం కూడా పెద్ద చర్చగా మారింది. దీంతో తోట సైకిల్ దిగడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే, పార్టీ మార్పు ప్రచారంపై ఇవాళ స్పందించారు రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. తాను ఏ పార్టీలోకి వెళ్లలని.. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ నాకు మిత్రులు మాత్రమే నన్న తోట త్రిమూర్తులు.. స్నేహం వేరు, రాజకీయం వేరు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. నాతో ఉన్న స్నేహం కారణంగానే తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తన కుమారుడి పెళ్లి  రిసెప్షన్‌కు వచ్చారని చెప్పారు ఎమ్మెల్యే తోట  త్రిమూర్తులు.