'ఫత్వా ఇచ్చినా మేం పట్టించుకోం..!'

'ఫత్వా ఇచ్చినా మేం పట్టించుకోం..!'

ఇప్పుడు బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఫత్వా రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఓవైపు ముస్లిం మత పెద్దలు టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కూతురు షబానా ఖాతూన్ పై ఫత్వా జారీ చేయగా... మరోవైపు మాకు ఫత్వా ఇచ్చినా మా పని మేం చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. తన కూతురిపై ఫత్వా జారీ చేయడంపై స్పందించిన జలీల్ ఖాన్... గతంలో మల్లికా బేగం మీద ఫత్వా జారీ చేసిన విషయం నిజమే.. కానీ, మల్లికా బేగం మత పెద్ద మాటను, ఫత్వాను గౌరవించలేదు.. ఫత్వా పక్కన పెట్టి రాజకీయాలు చేసి పోటీ చేసింది.. అలాంటి మల్లికా బేగం ఇప్పుడు నా కూతురిని ఎలా ప్రశ్నిస్తుందని ఫైర్ అయ్యారు జలీల్. ఇప్పుడు మాకు ఫత్వా ఇచ్చినా మా పని మేం స్తామని స్పష్టం చేసిన టీడీపీ ఎమ్మెల్యే... అయినా, 2009 నాటికి నేటికి పరిస్థితులు మారాయన్నారు. అరబ్ దేశాల్లోనే మహిళలు బయటకు వస్తున్నారని గుర్తుచేశారు. మల్లికా బేగం ఫత్వా జారీ చేసినా పోటీ చేసింది... మా అమ్మాయికి ఫత్వా జారీ చేసినా మేం కూడా పోటీ చేస్తామని ప్రకటించారు జలీల్ ఖాన్. మరోవైపు మల్లికా బేగం మీద జారీ చేసిన ఫత్వా నే జలీల్ కుమార్తె మీద అమలవుతుందని.. మహిళలు అందరికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు మత పెద్దలు.