చిత్తూరులో టీడీపీ ఆందోళన... స్లిప్ లపై... 

చిత్తూరులో టీడీపీ ఆందోళన... స్లిప్ లపై... 

ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.  కొన్ని చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి.  అయితే, చిత్తూరు జిల్లా రామంచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగలో టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.  ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులను రాసి పంపుతున్నారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, పోలీసులకు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పట్టించుకోకుంటే, దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు.  ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు టీడీపీ నేతలు.