పరిపాలనను కూడా వాళ్ళకే అప్పగించు: రావుల

పరిపాలనను కూడా వాళ్ళకే అప్పగించు: రావుల

పరిపాలనను కూడా కొడుకు కేటీఆర్, కూతురు కవితలకు అప్పగించమని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  సీఎం ఇచ్చిన మాట నీలబెట్టుకోలేదన్నారు. అమరుల స్థూపం నిర్మాణానికి స్థలం దొరకలేదు కానీ.. ఆయన ఇంటికి మాత్రం అంత తొందరగా స్థలం దొరికిందా? అని ప్రశ్నించారు. అమరుల స్థూపం ప్రపంచం స్థాయిలో గుర్తింపు ఇచ్చేలా పెడతా అన్నారు.. ఏమైందని ఆయన నిలదీశారు. ఉద్యమ సమయంలో 1200 మంది అమరులు అయ్యారు అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక 400 మందే అంటూ మాట మార్చారని గుర్తుచేశారు.

కేసీఆర్ దయలేనివాడన్నారు. కొండగట్టు ప్రమాదంలో 57 మంది చనిపోతే సమయం దొరకలేదు.. మరి ఎంత మంది చనిపోతే పోతావ్ అని కేసీఆర్ ను నిలదీశారు. రాజకీయ భిక్షపెట్టిన కరీంనగర్ కి పోవటానికి కూడా మనసు రాలేదా? అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మాసాయిపేటలో చిన్న పిల్లలు చనిపోతే కూడా పోనీ వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహించారు. ఏదైనా ప్రమాదం జరిగితే కొడుకు కేటీఆర్, కూతురు కవితలను పంపిస్తావ్.. ప్రభుత్వంను కూడా వారికే అప్పగించు అని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.