టీడీపీ నేతను ఇంటికెళ్లి అరెస్టు చేసిన పోలీసులు..

టీడీపీ నేతను ఇంటికెళ్లి అరెస్టు చేసిన పోలీసులు..

మల్కాజిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మండల రాధాకృష్ణయాదవ్‌ను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటికొచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన బోనాల పండుగ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్నందుకు సెక్షన్ 353 కింద రాధాకృష్ణపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే ఇవాళ అరెస్టు చేశారు. ఐతే.. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.