జగన్.. కేసీఆర్ చేతిలో పావుగా మారారు

జగన్.. కేసీఆర్ చేతిలో పావుగా మారారు

టీడీపీకి సేవలందిస్తున్న సేవామిత్ర యాప్ సర్వీస్ ప్రొవైడర్లపై తెలంగాణ పోలీసులను అడ్డంపెట్టుకుని వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని శాసన మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు జగన్ కలసిపోయారనేందుకు ఇది రుజువు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్.. కేసీఆర్ చేతిలో పావుగా మారారు అనేందుకు ఇంతకుమించి ఆధారం ఏం  కావాలని అన్నారు. నిర్వాహకులను కిడ్నాప్ చేసి సర్వర్లను స్వాధీనం చేసుకోవడానికి రాజకీయంగా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ సభ్యత్వ నమోదు, బూత్ కన్వీనర్ల డేటాతో పాటు టీడీపీ కమిటీ సభ్యుల వివరాలను దొంగిలిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఓటర్ల సమాచారం చేతులు మారిందనే ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందే తప్ప తెలంగాణ పరిధిలోకి రాదని పయ్యావుల అన్నారు.