బ్రేకింగ్ : టీడీపీ యువనేత మాగంటి రామ్ జీ మృతి

బ్రేకింగ్ : టీడీపీ యువనేత మాగంటి రామ్ జీ మృతి

ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా రాంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. అయితే అనారోగ్యానికి కారణం ఏమిటి అనేది మాత్రం తెలియరాలేదు. ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఇక ఆయన మరణానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నిజానికి నిన్ననే మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను కలిసి రాంజీ ఆరోగ్య వివరాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. లోకేష్ ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ మన ముందుకు వస్తారని ధైర్యం చెప్పారు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.