రేపు ఉదయం తెదేపా సైకిల్ యాత్ర....!

రేపు ఉదయం తెదేపా సైకిల్ యాత్ర....!
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా రేపు ఉదయం 8 గంటల నుంచి తాము ఏపీలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైకిల్ యాత్ర ప్రారంభిస్తామని ఏపీ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ తర్వాత కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయ 8 గంటలకు ఈ సైకిల్ యాత్రను చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ యాత్రలో చంద్రబాబు విజయవాడలో పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే.. ఎంపీలు ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చాక బ‌స్సు యాత్ర కూడా చేయాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే ఎల్లుండి మధ్యాహ్నం మరోసారి అఖిలపక్షం సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.