ఎన్ని విచారణలు జరిపినా అభ్యంతరం లేదు..! కాకపోతే....?

ఎన్ని విచారణలు జరిపినా అభ్యంతరం లేదు..! కాకపోతే....?

పరిపాలన చేయడం చేతగాకే వైసీపీ ప్రభుత్వం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. గత ప్రభుత్వ పాలనపై ఎన్ని విచారణలు జరిపినా తమకు అభ్యంతరం లేదు.. కాకపోతే 9 నెలల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం, ఇసుక అక్రమాలపై కూడా సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుశాఖను సొంత వ్యవహారాలకు వాడుకునేందుకే  సిట్ ఏర్పాటు చేశారని మండిపడ్డ ఉమ.. రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే సిట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు సీఎం జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారని విమర్శించిన ఆయన..రస్ ఆల్ ఖైమా విషయంలో వైసీపీ నేతలు ఎందుకు నోరుమెదడంలేదని ప్రశ్నించారు. ఇక, జగన్‌ కేసులో ముద్దాయిలందరికీ మారిషస్‌ కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు బోండా ఉమ.. ఈ కేసుల నుంచి బయటపడేయాలని ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని సీఎం జగన్ వేడుకున్నారని ఆరోపించారు.