మంత్రి జయరాం భూబకాసురుడు.. అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

మంత్రి జయరాం భూబకాసురుడు.. అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖ మంత్రి పుంగనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. మంత్రి జయరాం భూబకాసురుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఇటీనా ప్లాంటేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 203ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో జయరాం, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. బెంజ్ కార్ లంచం, ఈ.ఎస్.ఐ. నిధుల మల్లింపు, ఇప్పుడు భూముల వ్యవహారం ఇలా వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. జయరాం అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అయ్యన్నపాత్రుడు. ఇక, మంత్రి జయరాంపై వరుసగా అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేయడం చర్చగా మారింది.