వైసీపీ బహిరంగంగా మద్దతు ఇస్తుంది

వైసీపీ బహిరంగంగా మద్దతు ఇస్తుంది

వైసీపీ బహిరంగంగా టీఆర్ఎస్‌కు మద్దతిస్తోందని, ప్రత్యేక హోదాకు అడ్డుపడ్డ కేసీఆర్‌కు మద్దతిస్తారా? అంటూ టీడీపీ నేత అనురాధ ప్రశ్నించారు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, వైసీపీని ఏపీ ప్రజలు క్షమించరని అన్నారు. వైసీపీ ఆత్మ కేసీఆర్, అంతరాత్మ కేటీఆర్ అని విమర్శించారు. తెలంగాణలో వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే జగన్ కనీసం గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మిషన్ భగీరథ కాంట్రాక్టులు అప్పగించారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన సభలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్ టీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారని మండిపడ్డారు. నాలుగు రోజుల క్రితం సీమాంధ్ర మీటింగ్ అని బహిరంగంగా జై కేసీఆర్, జై జగన్ అంటూ కేసీఆర్ కు మద్దతివ్వమని పిలుపునిచ్చారని అనురాధ ఆరోపించారు.