నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద లోకేష్ ట్రాక్టర్‌ నడిపారు. టిడిపి నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్‌పై వెళుతుండగా అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే రామరాజు ట్రాక్టర్‌ను అదుపుచేశారు. దీంతో ప్రమాదం తప్పింది. హటాత్తుగా జరిగిన ఈ ఘటనతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడలిపోయారు.