పాపం వివేకానందరెడ్జి గొడ్డలితో ఆత్మహత్య చేరుకున్నారంటా !

పాపం వివేకానందరెడ్జి గొడ్డలితో ఆత్మహత్య చేరుకున్నారంటా !

తిరుపతి లోక్ సభ ఎన్నికలకు సంబంధించి శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టారు. కాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలువలతో కూడిన మచ్చలేని రాజకీయం చేశారని అన్నారు. గతంలో ఓట్లు వేయమని అడగటానికి వచ్చానని, ఇప్పుడు బాధ్యత గుర్తు చేద్దామని వచ్చానని అన్నారు. ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి కి ఓటేస్తే వెంటనే నేను ఏమీ ముఖ్యమంత్రిని కాను, కానీ ఈ ఎన్నికలు మీ భవిష్యత్తుతో ముడిపడినవని అన్నారు. గత ఐదేళ్లలో సమస్యల ఉన్నా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశానని అన్నారు. అమ్మఒడి అన్నారు తమ్ముల్లు నాన్న బుడ్డి ఏమైంది ? అని ప్రశ్నించారు. దిక్కుమాలిన బ్రాండ్ల మద్యం అమ్ముతున్నారన్న ఆయన స్వర్ణముఖికి వెలితే ఇసుక ఉచితంగా తెచ్చుకొన్నారని, ఇపుడు ఇసుక లారీ పదివేలకు అమ్ముతున్నారని అన్నారు.

జగన్ కు ప్రియ శిష్యుడు మీ శాసనసభ్యుడు ఇసుక చెన్నైకి తరలిస్తున్నారని, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని అన్నారు. ప్రధాన అర్చకులు జగన్ ను విష్ణుమూర్తితో పోల్చారని, అప్పుడు పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందన్నారని అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందన్న ఆయన నేను తిరుపతి విమానాశ్రయం వస్తే పది గంటలపాటు నిలిపేశారుని నేనే తలచుకొంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా ? అని ప్రశ్నించారు. పంచాయతి ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ప్రశ్నిస్తే నాపై తప్పుడు కేసులు పెడతున్నారని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా నా రికార్డు ఎవరు అదిగమించలేరని అన్నారు. పాపం వివేకానందరెడ్జి గొడ్డలితో ఆత్మహత్య చేసుకొన్నారట అంటూ ఆయన విమర్శించారు.