బ్రేకింగ్: టీఆర్ఎస్‌లో టీడీఎల్పీ విలీనం..

బ్రేకింగ్: టీఆర్ఎస్‌లో టీడీఎల్పీ విలీనం..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్‌ తగిలింది... టీఆర్‌ఎస్‌లో టీడీఎల్పీ విలీనం అయ్యింది... తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు మచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య.. టీఆర్‌ఎస్‌ఎల్పీలో.. టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర.. కానీ, మచ్చా నాగేశ్వరరావు మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు అధికారికంగా ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ పార్టీలో చేరి.. టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువాలు ధరించి కనిపించారు. మొత్తంగా.. తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ తగిలింది.. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిథ్యం ముగిసిపోయింది.