తొమ్మదిలోనే తాప్సి ప్రేమాయణం..విన్నారంటే..

తొమ్మదిలోనే తాప్సి ప్రేమాయణం..విన్నారంటే..

తాప్సీ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మంచు విష్ణు నటించిన ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర సీమలో కాలు మోపింది. తరువాత  మంచి ఆఫర్లు అందుకొవడమే కాకుండా స్టార్ హీరోల పక్కన కూడా నటించింది. కానీ అంతగా లాభం లేకపోయింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది. ఆ తరువాత బాలీవుడ్‌కు మారిపోయింది. అక్కడ ఊహకందని స్థాయిలో బీజీ జీవితాన్ని గడుపుతోంది. వరుస సినిమాలు చేస్తూ అందరిని అలరించడమే కాకుండా మంచి పేరును సంపాదించింది. లేడీ ఓరియాంటెట్ సినిమాలకు, ప్రయోగాత్మక సినిమాలకు కెరాఫ్‌గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగాఉన్న తాప్సి తాజాగా తన చిన్ననాటి విషయాలను కొన్నింటిని పంచుకుంది. వాటిలో తొమ్మిదో తరగతిలోని తన ప్రేమాయణం కూడా చెప్పింది. అయితే తను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకుందట. అతడిని అమితంగా ప్రేమించింది. అతడు కూడా తనను ప్రేమించాడని కానీ చదువుపై దృష్టిపెట్టాలని తనతో మాట్లాడటం మానేడట. దాంతో మనస్తాపం చెంది, పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి అతడికి ఫోన్ చేసి బోరున ఏడ్చేసిందట. అయితే అది తన ఫస్ట్ క్రష్ అని తనకున్న బెస్ట్ మెమొరీస్‌లో ఒకటని చెప్పకొచ్చింది. దీంతో తాప్సి మాటలు విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. తొమ్మిదిలోనే ప్రేమించిందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.