దిగొచ్చిన తాండవ్ వెబ్ సిరీస్ టీమ్.. ఎట్టకేలకు క్షమాపణలు !
తాండవ్ వెబ్ సిరీస్ రగడ ముదురుతోంది. హిందూ మత విశ్వాసాలను కించపరిచే విధంగా వెబ్‌సిరీస్ తీశారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అటు బీజేపీ, శివసేన నేతలు కూడా భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ డైరెక్టర్ అలీ అబ్బాస్‌పై లక్నోలో కేసు నమోదైంది. వెంటనే తాండవ్‌ను బ్యాన్ చేయాలంటూ అమెజాన్ ప్రైమ్‌కి నోటీసులు వెళ్లాయి. విమర్శలతో వెనక్కి తగ్గిన తాండవ్ టీమ్ క్షమాపణలు చెప్పింది.
ఏ మతం , కులం, సెంటిమెంట్లను కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్పింది తాండవ్. అయితే తాండవ్ వివాదంపై ఐ అండ్ బీ మినిస్టరీ దృష్టి సారించింది. వెబ్‌సిరీస్‌పై వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న మంత్రిత్వ శాఖ.. తాండవ్ టీమ్‌ను వివరణ కోరింది. మరోవైపు ఈ వెబ్ సిరీస్‌ను వెంటనే అమెజాన్ ప్రైమ్ నుంచి తొలగించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అమెజాన్ ప్రైమ్‌పై తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు.
తాండవ్ వివాదంతో ఓటీటీని రెగ్యూలేట్ చేయాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఈ దిశగా ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేపట్టింది. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఓటీటీల్లో వచ్చే వెబ్‌సిరీస్‌లు, సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని సెన్సార్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు. ఓటీటీలో వచ్చే కటెంట్‌ను కూడా రెగ్యూలేట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)