మా ప్రభుత్వం వస్తే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ...

మా ప్రభుత్వం వస్తే 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ...

మేం అధికారంలోకి రాగానే 2,50,000 ఖాళీ ఉద్యోగులతో పాటు 5 రూపాయల భోజనంను మహాజన భోజనం పథకంగా పెట్టి మరో లక్ష ఉద్యోగులు ఇస్తామని తెలిపారు బీఎల్‌ఎఫ్‌ నేత, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... మభబూబాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఆదరిస్తున్నారన్నారు. చదువు మంచిగా ఉండాలి, జ్వరం వస్తే మంచి ఆసుపత్రి ఉండాలి, కుల విభేదాలు తొలిగి పోవాలి, ఉండడానికి ఇళ్లు కావాలన్నారు. ఇప్పుడంతా ప్రైవేట్ ఆస్పత్రులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించిన తమ్మినేని... మేం అధికారంలోకి వస్తే గవర్నమెంట్ స్కూల్, ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రైవేట్ స్కూళ్లను, ఆస్పత్రులను బంద్ చేస్తాం... ఉన్నవాడికి లేని వాడికి ఒకే వైద్యం, విద్య అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కలిపిస్తామన్న తమ్మినేని... తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. రైతు బంధును కొనసాగిస్తున్నట్లుగా, కూలి బంధు పథకం పెట్టాలి, అధికారంలోకి వస్తే మేం అమలు చేస్తామన్నారు. మీరు అధికారంలో వస్తే, వెలమ, రెడ్డీలకు ప్రాధాన్యత ఇస్తారు, మేం అధికారంలోకి వస్తే పేదలకు అధికారం ఇస్తామని స్పష్టం చేశారు తమ్మినేని.