తమిళనాడులోనూ వాటిపై నిషేధం... పట్టుబడితే జైలుశిక్షే.. 

తమిళనాడులోనూ వాటిపై నిషేధం... పట్టుబడితే జైలుశిక్షే.. 

తమిళనాడు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  ఆన్లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు. మొబైల్, కంప్యూటర్ మరే ఇతర కమ్యూనికేషన్ డివైజ్ ద్వారా ఆన్లైన్ గేమ్ ను ఆడితే రూ.5 వేలు ఫైన్ ఆరు నెలల జైలు శిక్ష, ఆన్లైన్ గేమింగ్ హౌస్ ను నిర్వహిస్తూ పట్టుబడితే రూ.10వేలు ఫైన్ రెండేళ్లు జైలు శిక్ష విధిస్తామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఆన్లైన్ గేమ్ కారణంగా తమిళనాడులో యువత తీవ్రంగా నష్టపోతున్నది.  ఆన్లైన్ గేమ్ కారణంగా యువత అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.  ఇదే బాటలో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది.