మాన‌వ‌త్వంతో చికిత్స అందించండి :గవర్నర్ తమిళిసై

మాన‌వ‌త్వంతో చికిత్స అందించండి :గవర్నర్ తమిళిసై

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజుకు రెండు వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలే కాకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కాగా సోమవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్ తమిళి సై నెటిజన్లతో గంటసేపు వరకు సంభాషించారు. సంభాషణలో నెటిజన్లు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ గురించి ఆమెకు తెలియజేసారు. దాంతో గవర్నర్ మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. కరోనా పరీక్షలు, చికిత్స, పేషెంట్ల బెడ్లు, ట్రీట్మెంట్ బిల్లులు తదితర అంశాలపై వారితో చర్చించారు. ఆస్పత్రికి వచ్చే కరోనా బాధితులకు భరోసా కల్పించేలా చికిత్సను అందించాలని కోరారు. కరోనా బాధితులు ఆస్పత్రికి వస్తే చేర్చుకోవాలని ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసారు. కరొనతో వచ్చే వారిపట్ల బాధ్యతగా, మానవత్వంతో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, కిమ్స్, కేర్ ఆసుపత్రి, అపోలో, విరించి, కామినేని, సన్ షైన్, గ్లోబల్, మల్లారెడ్డి నారాయణ, యశోద, కాంటినెంటల్ ఆసుపత్రుల ప్రతినిధులు ఉన్నారు.