కరోనా ను జయించిన తమిళనాడు గవర్నర్.!

 కరోనా ను జయించిన తమిళనాడు గవర్నర్.!

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (80) కరోనా ను జయించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు వారాల క్రితం భన్వరీలాల్ టెస్ట్ చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రి వైద్యులు ఆయనను 24 గంటలూ పర్యవేక్షిస్తూ వచ్చారు. చికిత్స తరవాత ఆయన తాజాగా మళ్ళీ పరీక్ష చేసుకోగా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన చురుగ్గా ఉన్నారని, ధైర్యం, సంకల్పం వల్లే ఆయన త్వరగా బయటపడగలిగారని డాక్టర్ లు తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడు రాజ్‌భవన్‌లో మొత్తం 84 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు.