తమన్నా కోటిన్నర అడుగుతోందా ?

తమన్నా కోటిన్నర అడుగుతోందా ?

ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజైన తెలుగు సినిమాల్లో పెద్ద హిట్టంటే 'ఎఫ్ 2' సినిమానే.  సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపించింది.  దీంతో అందులో కథానాయకిగా నటించిన తమన్నా క్రేజ్ మళ్ళీ పెరిగింది.  ఈ సినిమా ముందు వరకు ఆమెకు ఆఫర్లు రావడమే కష్టమనుకుంటే ఇప్పుడు వరుస ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి.  

తాజాగా యాంకర్, దర్శకుడు ఓంకార్ 'రాజుగారి గది 3' కోసం తమన్నాను సంప్రదించాడట. ఆమె ఏకంగా కోటిన్నర వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.  దీంతో షాక్ తినడం ఓంకార్ వంతైందని టాక్.  మరి నిజంగానే తమన్నా కోటిన్నర డిమాండ్ చేసిందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఖచ్చితమైన సమాచారం అందే వరకు వేచి చూడాల్సిందే.