‘శభాష్’ అనేలా తాప్సీ ‘బంతాట’!

‘శభాష్’ అనేలా తాప్సీ ‘బంతాట’!

తాప్సీ క్రికెట్ మొదలెట్టింది. అదేంటి, యాక్టింగ్ మానేసిందా అంటారా? అస్సలు కాదు! క్రికెటర్ గా యాక్టింగ్ చేసేందుకు నిజంగానే బంతాట ఆడేస్తోంది! రీల్ లైఫ్ ఇన్నింగ్స్ కోసం రియల్ లైఫ్లో బ్యాట్ పట్టి భారీ షాట్స్ కొట్టేస్తోంది! 

తాప్సీ ప్రస్తుతం నాలుగు చిత్రాలతో యమ బిజీగా ఉంది. ‘హసీన్ దిల్ రుబా, రశ్మీ రాకెట్, లూప్ లపేటా, షభాష్ మిథూ’ సినిమాలు తాప్సీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్నాయి. ఇవన్నీ కంటెంట్ ఆధారంగా క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నవే. అయితే, ఇప్పటికే డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ గా మారిన తాప్సీ పన్ను రానున్న చిత్రాలతో మరింత సత్తా చాటనుంది. ఆమె చేస్తోన్న నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా ప్రస్తుతం ‘షభాష్ మిథూ’ సినిమాపై తాప్సీ స్పెషల్ ఫోకస్ పెట్టింది...

‘షభాష్ మిథూ’ టైటిల్ తో రూపొందుతోన్న తాప్సీ స్టారర్ స్పోర్ట్స్ మూవీ... మిథాలీ రాజ్ బయోపిక్. ఇండియన్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్ గా అద్భుతాలు సృష్టించిన మిథాలీ ఎందరికో ఇన్ స్పిరేషన్. అందుకే, ఆమె లైఫ్ ని బాలీవుడ్ తెరకెక్కిస్తోంది. వెండితెరపై మిథాలీ రాజ్ గా తాప్సీ కనిపించబోతోంది. అంతే కాదు, సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందు నుంచే సీరియస్ గా క్రికెట్ ప్రాక్టీస్ లో మునిగిపోయింది.

తన యాక్టింగ్ లో పూర్తి పర్ఫెక్షన్ కోరుకునే మన లేడీ పర్ఫెక్షనిస్ట్... మిథాలీ రాజ్ స్నేహితురాలు నూషిన్ అల్ ఖాదర్ శిక్షణలో... బ్యాటింగ్, బౌలింగ్ చేస్తోంది. నూషిన్ కూడా గతంలో ఇండియన్ ఉమన్ క్రికెట్ టీమ్ లో ప్లేయర్ గా దేశానికి ప్రాతినిధ్యం వహించింది. మిథాలీ రాజ్ ఆటతీరుని ఎన్నో సంవత్సరాలు దగ్గర్నుంచీ గమనించింది. అందుకే, ఆమె తాప్సీని ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మిథాలీగా మార్చేసే పనిలో ఉంది! వెల్... తాప్సీ కృషి ఫలించి... ఆమె నటిస్తోన్న ‘షభాష్ మిథూ’ని ప్రేక్షకులు కూడా షభాష్ అనేయాలని మనమూ కోరుకుందాం!