తన ట్రైనింగ్ ఫొటోలను షేర్ చేసిన తాప్సి

తన ట్రైనింగ్ ఫొటోలను షేర్ చేసిన తాప్సి

న్యూఢిల్లీ: తాప్సి ఈ పేరు అందరికీ సుపరిచితమే అనడంలో సందేహం అక్కర్లేదు. తనదైన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈమె కొత్తగా చేస్తున్న సినిమా రష్మీ రాకెట్. ఈ సినిమా కోసం ఈ అమ్మడు తెగ కష్టపడుతోంది. ఇటీవల తన ట్రైనింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పింక్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ఒకటి. పన్ను తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఎంతో కష్టపడుతున్న తాప్సి ఈ గాయాలు తనపై ఎటువంటి ముద్ర వేయలేవనీ, కేవలం తన కండరాలపై మాత్రమే ప్రభావం చూపుతాయని అంటోంది. తీప్సి ఇటీవల హసీన్ దిల్‌రూబా, తప్పడ్‌లకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పడు స్పోర్ట్స్ డ్రమాగా తెరకెక్కుతున్న సినిమా రష్మీ రాకెట్‌కు సన్నద్దం అవుతుంది.