వైరల్:  మాస్క్ ఎలా పెట్టుకోవాలో నేర్పిన హంస... ఫిదా అవుతున్న నెటిజన్లు 

వైరల్:  మాస్క్ ఎలా పెట్టుకోవాలో నేర్పిన హంస... ఫిదా అవుతున్న నెటిజన్లు 

కరోనా కాలంలో మాస్క్ లేకుండా ప్రజలు బయటకు రావడం లేదు.  ఎటు నుంచి కరోనా వైరస్ కాటేస్తుందనే భయంతో మాస్క్ తగిలించుకొని తిరుగుతున్నారు.  అయితే, మాస్క్ తప్పనిసరిగా నోరు, ముక్కును కవర్ చేస్తుండాలి.  అప్పుడే కరోనా బారి నుంచి బయటపడొచ్చు.  కొంతమంది మాస్క్ ను ముక్కు కిందకు వేలాడదీసి తిరుగుతుంటారు.  ఫోటోలు దిగేందుకు మాస్క్ ను ముక్కు, నోరు కిందకు తీస్తుంటారు.  ఇలానే ఓ యువతి పార్క్ లో హంసతో ఫోటో దిగేందుకు మాస్క్ ను కిందకు తీసింది.  అది గమనించిన ఆ కొంగ, మాస్క్ ను లాగి ముక్కు మీదకు వేసింది.  దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  కరోనా గురించి హంసకు కూడా తెలిసిందని, మాస్క్ సరిగా వేసుకోకుంటే కరోనా బారిన పడతారని చెప్పడం కోసం ఆ హంస అలా చేసినట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.