బాబు తిరుపతి పర్యటనపై కొనసాగుతున్న ఉత్కంఠ... 

బాబు తిరుపతి పర్యటనపై కొనసాగుతున్న ఉత్కంఠ... 

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తరువాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు.  చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజులపాటు పర్యటించారు.  ఇక చిత్తూరులో పర్యటించేందుకు పోలీసులు అనుమతించలేదు.  చిత్తూరులో బాబు దీక్ష చేయాలని సంకల్పించారు.  అయితే, దీనికి పోలీసులు అనుమతించలేదు.  కాగా, ఈరోజు చంద్రబాబు తిరుపతిలో పర్యటించాల్సి ఉన్నది.  తిరుపతిలో ధర్నా చేయాలని నిర్ణయించారు.  కానీ, ఈ ధర్నాకు కూడా పోలీసులు అనుమతులు ఇవ్వలేదు.  కోవిడ్ నిబంధనలు పాటించాలని, ధర్నాలు, దీక్షలు చేస్తే కరోనా కేసులు పెరిగి అవకాశం ఉందని అంటూ అనుమతులు నిరాకరించారు పోలీసులు.  పోలీసులు అనుసరిస్తున్న విధానాలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.