రివ్యూ: బందోబస్త్ 

రివ్యూ: బందోబస్త్ 

నటీనటులు: సూర్య, ఆర్య, సయేశా, మోహన్ లాల్, బోమన్ ఇరానీ తదితరులు 

మ్యూజిక్: హరీష్ జయరాజ్ 

సినిమాటోగ్రఫీ: ఎంఎస్ ప్రభు 

నిర్మాత: సుభాస్కరన్ 

దర్శకత్వం: కెవి ఆనంద్ 

కొత్తదనం కోరుకుంటూ సినిమాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు.  కథలో కొత్తదనం కనిపిస్తే.. సూర్య సినిమా చేస్తాడు.  ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది తరువాత సంగతి.  సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయడంలోను, నటనకు స్కోప్ ఉండే సినిమాలు చేయడంలోనూ సూర్య ముందు ఉంటాడు.  అలాంటి సూర్య మొదటిసారి..ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో కూడిన బందోబస్త్ సినిమా చేశాడు. కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఆ మూవీ ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దామా.  

కథ: 

ప్రజల సంక్షేమం కోరి ప్రజలకోసం పనిచేసే ప్రధాని మోహన్ లాల్ ను చంపేందుకు కొంతమంది ఉగ్రవాదులు పధకం వేస్తారు.  అదే సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించే ఆఫీసర్ గా సూర్య పరిచయం అవుతారు. సూర్య ధైర్యసాహసాలకు మెచ్చిన ప్రభుత్వం ఆయన్ను ప్రధాని పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తుంది.  అదే సమయంలో సూర్య సయేశా ప్రేమలో పడతాడు.  వీరి ప్రేమకథ సాగుతుండగా.. ప్రధాని హత్యకు గురవుతాడు.  ఆ హత్య చేసింది ఎవరు అన్నది మిస్టరీగా మారుతుంది.  ఆ మిస్టరీని ఛేదించేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు.  ప్రధానిని హత్య చేసిన వ్యక్తిని సూర్య పెట్టుకున్నాడా లేదా? మోహన్ లాల్ తరువాత ప్రధాని పీఠంపై కూర్చున్న బోమన్ ఇరానీకి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉన్నదా..? హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ బందోబస్త్.. 

విశ్లేషణ: 

పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ తో సినిమాను తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి థ్రిల్లింగ్ కలిగించే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.  ప్రధానిని హత్య చేయడానికి దారి తీసిన పరిణామాలు దాని చుట్టూ జరిగిన సంఘటనలతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు.  సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.  ప్రధాని మోహన్ లాల్ హత్యకు ముందు కథ నడిచిన విధానం.. హత్య తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు, విచారణ తదితర అంశాలను చక్కగా సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్ ను ఆసక్తికరంగా నడిపించినా.. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చే సరికి ఒక్కసారిగా స్లో అయ్యింది.  అదే సినిమాకు కొంత మైనస్ గా నిలిచింది.  

స్లో నరేషన్ కారణంగా సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు కాస్త విసుగు తెప్పిస్తుంది.  క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.  చంద్రకాంత్ పాత్రలో మోహన్ లాల్ ఎప్పటిలాగేమెప్పించాడు.  సూర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  దర్శకుడు కెవి ఆనంద్ తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నా.. దాని చుట్టూ అల్లుకున్న కథనాలు స్లోగా ఉంటడమే సినిమాకు మైనస్ అయ్యింది.  మొత్తంగా సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. 

నటీనటుల పనితీరు: 

సూర్య పవర్ఫుల్ ఆఫీసర్ గా మెప్పించారు. తన సీరియస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.  మోహన్ లాల్ ప్రధానిగా నటన అమోఘం.  సయేశా అందంతో ఆకట్టుకుంది.  ఆర్య, బోమన్ ఇరానీలు పర్వాలేదనిపించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

కెవి ఆనంద్ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది.  అయితే, ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనాలను కాస్త వీక్ గా ఉన్నాయి.  కథనాలు బలంగా ఉన్నట్టయితే సినిమా ఇంకా బాగుండేది.  హరీష్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.  ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.  

పాజిటివ్ పాయింట్స్: 

సూర్య 

మోహన్ లాల్ 

మ్యూజిక్ 

సినిమాటోగ్రఫీ 

కాన్సెప్ట్ 

మైనస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ సాగతీత 

చివరిగా : బందోబస్త్ : ఇంకాస్త బలంగా ఉంటె బాగుండేది.