'అవన్నీ పుకార్లే.. నేను క్షేమంగానే ఉన్నా..'

'అవన్నీ పుకార్లే..  నేను క్షేమంగానే ఉన్నా..'

తనకేం కాలేదని.. క్షేమంగానే ఉన్నానని ప్రకటించాడు టీమీండియా క్రికెటర్‌ సురేష్‌ రైనా. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని  ఖండించాడు. కారు ప్రమాదానికి గురై రైనా తీవ్రంగా గాయపడ్డాడని యూట్యూబ్‌లో ఫేక్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. కొందరైతే ఏకంగా రైనా మరణించారని రాసేశారు. ఈ వార్తలపై  రైనా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. తాను కారు ప్రమాదంలో గాయపడ్డానని కొన్నిరోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉందని.. అవి కేవలం పుకార్లేనని చెప్పారు.  ఆ పుకారుతో తన కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్న రైనా.. దయచేసి ఇలాంటివి నమ్మొద్దని సూచించాడు. దేవుడి దయవల్ల తాను క్షేమంగానే ఉన్నానని.. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన యూట్యూబ్‌ చానెళ్లపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని చెప్పాడు.