ఏపీ మున్సిపల్ ఎన్నికలపై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. రేపే ఎన్నికలు జరగనున్నాయి.. ఈ తరుణంలో.. మున్సిపాలిటీల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు అయ్యింది.. ప్రస్తుత నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు అవుతున్నందున కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు పిటిషనర్... అయితే, పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం... ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, కొత్త నోటిఫికేషన్ అవసరమా లేదా అన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం విచక్షణాధికారం అని స్పష్టం చేసింది.. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని అభిప్రాయపడింది జస్టిస్ అశోక్ భూషణ్ , జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. దీంతో.. మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది.. ఇక, రేపు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుండగా.. ఈ నెల 14వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. 
--