అంగన్‌వాడీ కేంద్రాలపై సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

 అంగన్‌వాడీ కేంద్రాలపై సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు... అంగన్‌వాడీ కేంద్రాల పునర్‌ప్రారంభంపై జనవరి 31వ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం... కరోనా విజృంభణ కారణంగా గత ఏడాది మూతబడ్డాయి అంగన్ వాడీ కేంద్రాలు.. అయితే, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు.. విపత్తు నిర్వహణ అధికారులను సంప్రదించిన తర్వాత మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలను తెరవడానికి ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం షెడ్యూల్ 2 ప్రకారం తప్పనిసరిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. పిల్లలు, తల్లులకు పోషక సహాయాన్ని అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లతో పాటు తల్లులకు, గర్భిణిలకు పోషక ఆహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. కరోనాతో మూతబడిన ఈ కేంద్రాలను తిరిగి ప్రారంభించేకు చర్యలు తీసుకోవాలని.. దానిపై అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలంటోంది సుప్రీంకోర్టు.