పోలీసులే నిర్ణయం తీసుకోవాలి... 

పోలీసులే నిర్ణయం తీసుకోవాలి... 

జనవరి 26 వ తేదీన రైతులు ఢిల్లీలో భారీ ర్యాలీని తలపెట్టేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.  మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.  అయితే, అదే రోజున రిపబ్లిక్ డే కావడంతో, భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయి...కాబట్టి రైతుల ట్రాక్టర్ల ర్యాలీని అనుమతించకూడదు అని చెప్పి కేంద్రం సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేసింది.  దీనిపై సుప్రీం కోర్టు ఈరోజు మరోసారి విచారణ జరిపింది.  పోలీసుల పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని, ర్యాలీపై పోలీసులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.  దీనిపై కేంద్రం ఫైల్ చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరింది.  వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ నుంచి ఒకరు తప్పుకోవడంతో కమిటీ పునర్నియామకంపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చారు.