రివ్యూ: సూపర్ 30

రివ్యూ: సూపర్ 30

నటీనటులు: హృతిక్‌ రోషన్‌, మృణాల్‌ ఠాకూర్, వీరేంద్ర సక్సేనా, పంకజ్‌ త్రిపాఠి, జానీ లీవర్‌, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు
మ్యూజిక్: అజయ్‌, అతుల్‌
సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి
నిర్మాణ సంస్థ: ఫాంటమ్‌ ఫిలింస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హెచ్‌ఆరెక్స్‌ ఫిలింస్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వికాస్‌ బెహెల్‌  

బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ బీహార్ కు చెందిన గణిత వేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సూపర్ 30 సినిమాలో హీరోగా చేశారు.  ఈ బయోపిక్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  వికాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.  

కథ: 

బీహార్ లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆనంద్ కుమార్ కు చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం.  చదువుకోసం చాలా కష్టపడేవాడు.  ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చదువుతాడు.  కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకుంటాడు.  కానీ, తనకున్న ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అక్కడికి వెళ్లలేక లోకల్ గా నే చదువు పూర్తి చేస్తాడు.  

చదువు పూర్తయ్యాక ఓ కాలేజీలో గణిత ప్రొఫెసర్ గా జాయిన్ అవుతాడు.  డబ్బున్న వాళ్ళకే ఆ కాలేజీలో న్యాయం జరుగుతుంది.  పేద విద్యార్థులకు సారైనా న్యాయం జరగదు.  ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ కుమార్.. పేద పిల్లల చదువు కోసం ఓ నిర్ణయం తీసుకుంటాడు.  ఆ నిర్ణయం వలన ఆనంద్ కు ఎదురైనా పరిణామాలు ఏంటి..? పేద పిల్లలకు న్యాయం జరిగిందా లేదా అన్నది సినిమా కథ.  

విశ్లేషణ: 

మాములుగా బయోపిక్ సినిమా అంటే.. ఒక ఆర్ట్ ఫిల్మ్ లా ఉంటుందని అనుకుంటారు.  ఆనంద్ కుమార్ లాంటి జీవితం అంటే ఖచ్చితంగా అది ఓ డాక్యూమెంటరీ రూపంలో ఉంటుందని అనుకుంటారు.  కానీ, సినిమా చూసే వాళ్లకు అలా అనిపించదు.  మాములు సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.  పాత్రలను చాలా సహజసిద్ధంగా డిజైన్ చేసుకున్నారు దర్శకుడు.  కథకు హీరో హృతిక్ రోషనే.  తన భుజస్కందాలపైనే కథ మొత్తాన్ని నడిపించాడు.  

బీహార్ కు చెందిన వ్యక్తిలా హృతిక్ ను చూపించడానికి మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.  అక్కడి వ్యక్తులు ముదురు గోధుమ రంగులో ఉంటారు. దాని కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.  సినిమా ఓపెనింగ్ నుంచి ప్రతి సీన్ చాలా కొత్తగా థ్రిల్ గా అనిపించే విధంగా తీర్చి దిద్దారు.  ఇదేదో స్టూడెంట్స్ కు సంబంధించిన సినిమా బోర్ కొడుతుందేమో అనే బ్రాంతి లేదు.  బయోపిక్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటం సినిమాకు ప్లస్ అయ్యింది.  

నటీనటుల పనితీరు: 

హృతిక్ రోషన్ వన్ మ్యాన్ షోగా సినిమాను నడిపించాడు.  ఆనంద్ కుమార్ పాత్రలో ఇమిడిపోయి నటించాడు.  బిహారి యాసలో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.  టివి నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేయిస్న్ది.  పాత్ర చిన్నదే అయినా ఒదిగిపోయి నటించింది.  అందంగా కూడా కనిపించింది.  మిగతా నటీనటులు వారి పాత్ర పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు వికాస్ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.  బయోపిక్ సినిమానే అయినప్పటికీ రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లో చిత్రీకరించారు.  ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను డీల్ చేశారు.  అనయ్ గోస్వామి కెమెరా టేకింగ్ బాగుంది.  అజయ్, అతుల్ సంగీతం ఆకట్టుకుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్; 

కథ

కథనాలు 

నటీనటులు 

మైనస్ పాయింట్స్; 

హృతిక్ రోషన్ మేకప్ 

చివరిగా: సూపర్ 30 .. సూపర్ ప్రయోగం