ఐపీఎల్ 2021 : సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ 2021 : సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభానే అందించారు. కానీ సన్‌రైజర్స్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వరుస ఓవర్లలో రోహిత్ ,సూర్యకుమార్ ల వికెట్లు తీసి ముంబై ని దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు హైదరాబాద్ బౌలర్లు. కానీ చివర్లో ముంబై స్టార్ హిట్టర్ పొలార్డ్(35) రెండు సిక్సులు బాదడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో విజయ్ శంకర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్ ఒక్క వికెట్ తీసాడు. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించాలంటే 151 పరుగులు చేయాలి. కానీ గత మ్యాచ్ లో కూడా ఇదే లక్ష్యాన్ని చేధించలేక ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఏం చేస్తుంది అనేది చూడాలి.