‘నోకేన్ నో గెయిన్' అంటున్న సన్ రైజర్స్ అభిమానులు...

‘నోకేన్ నో గెయిన్' అంటున్న సన్ రైజర్స్ అభిమానులు...

ఐపీఎల్ 2020 లో ఆడిన మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన సన్ ‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో బోణీ కొట్టింది. దాంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ తోనే జట్టులోకి రాగా.. జమ్మూ కశ్మీర్ క్రికెటర్ అబ్దుల్ సమాద్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ 26 బంతుల్లో 41 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. దాంతో సన్ ‌రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బౌలర్లు చెలరేగడంతో విజయాన్నందుకుంది. దాంతో జట్టు అభిమానులు విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే ఢిల్లీ జట్టును గెలిపించలేకపోయిన రిషభ్ పంత్‌ను ట్రోల్ చేస్తున్నారు. ''కేన్ విలియమ్సన్ రాకతో జట్టు బలం పెరిగింది. ‘నోకేన్ నో గెయిన్'అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తప్ప మారె కారణంతో కేన్ ను తుది జట్టు నుంచి తప్పించవద్దు అని సన్ ‌రైజర్స్ యాజమాన్యాన్ని కోరుతున్నారు.