లాక్ డౌన్ లోనూ రెచ్చగొడుతున్న సన్నీ... 

లాక్ డౌన్ లోనూ రెచ్చగొడుతున్న సన్నీ... 

 ఇండియాలో లాక్ డౌన్ విధించే సమయంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్  అమెరికా వెళ్ళిపోయింది.  అక్కడ భర్త వెబర్ కుటంబంతో సరదాగా గడుపుతున్నది.  అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నది.  ఇండియా వదిలి రావడం ఇష్టం లేకపోయినా, భర్త వెబర్ తల్లిగారిని చూసుకోవడం కోసం రావాల్సి వచ్చినట్టు ఇప్పటికే సన్నీలియోన్ తెలిపింది.  

లాక్ డౌన్ కాలంలో కూడా సన్నీలియోన్ తన బిజినెస్ ను మానలేదు.  సొంతంగా ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తులను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నది.  అంతేకాదు, హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నది.  రీసెంట్ గా సన్నీ బ్లాక్ స్విమ్ సూట్ లో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది.  నేను ఈతకు రెడీగా ఉన్నా మీరు సిద్ధమా అన్నట్టుగా ఫోజులు ఇచ్చింది.  స్నేహితురాలితో కలిసి వయ్యారంగా ఫోజులు ఇచ్చిన సన్నీ స్విమ్ సూట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.   అంతేకాదు, ఈత గురించి ఓ పెద్ద ఉపదేశమే ఇచ్చింది సన్నీ.