పుజారా కారణంగానే గెలిచాం : గవాస్కర్
భారత స్టార్ టెస్ట్ ఆటగాడు చతేశ్వర్ పుజారాపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. 140 కిలోమీటర్ల వేగంతో ఆసీస్ బౌలర్లు వేస్తున్న బంతుల్ని ఈ సిరీస్‌లో పుజారా ఎదుర్కొన్న తీరు అసాధారణమని అభిప్రాయపడ్డారు. అయితే చివరి టెస్ట్ చివరి రోజు ఉదయం శుభ్‌మన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. కానీ తర్వాత కంగారూలు పైచేయి సాధించకుండా పుజారా చూసుకున్నాడు. పుజారా గ్లోవ్స్, బాడీ, హెల్మెట్‌కు పదేపదే బంతులు తగిలినా ఏమాత్రం బెదరలేదు. క్రీజులో ఉంటూ యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. అందుకే అతని ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత రిషబ్ పంత్ జోరు చూపించాడు. రహానే మరోసారి పంత్‌ను ఐదో స్థానంలో పంపాడు. ఆసీస్‌లో అతడు సారథ్యం వహించిన మూడు టెస్టుల్లో రెండింట్లో భారత్ నెగ్గింది. ఇంతకుముందు రహానే నాయకత్వంలో రెండు టెస్టుల్లోనూ జట్టు గెలిచింది' గవాస్కర్ గుర్తు చేసాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)