అశ్విన్ టెస్ట్ ప్లేయర్‌గానే కొనసాగాలి : గవాస్కర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ రీఎంట్రీ కష్టమే అన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. టెస్టుల్లో అశ్విన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగినా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన టెంపోను కొనసాగించలేకపోయాడని అన్నారు. హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా రాకతో అశ్విన్‌కు జట్టులో స్థానం కష్టమైందని అభిప్రాయపడ్డారు. ఇక అశ్విన్ టెస్ట్ ప్లేయర్‌గానే కొనసాగాలని చెప్పుకొచ్చారు సునీల్ గవాస్కర్. అయితే ఇంగ్లాండ్ తో జరిగియినా రెండో టెస్టులో బ్యాట్ తోను బాల్ తోను రాణించిన అశ్విన్ ను తర్వాత జరగబోయే టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు బీసీసీఐ.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)