మూడు మ్యాచ్ లు ఆడకపోతే.. తిడతారా...?

మూడు మ్యాచ్ లు ఆడకపోతే.. తిడతారా...?

ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. దాంతో అతని పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ భారత దిగ్గజ  క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. మూడు మ్యాచుల్లో కోహ్లీ విఫలమైనంత మాత్రన మునిగిపోయేదేం లేదని, త్వరలోనే తిరిగి ఫామ్‌ అందుకుంటాడని తెలిపాడు. కోహ్లీ గొప్ప క్లాస్‌ బ్యాట్స్‌మన్‌. ఆ విషయం అందరికీ తెలిసిందే. టోర్నీ ముగిసే సమయానికి విరాట్ కచ్చితంగా 500 పరుగులు పూర్తి చేస్తాడు. 2016లో అతను ఎలా విజృంభించాడో మనందరం చూశాం. అయితే ఈసారి అన్ని పరుగులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే మూడు మ్యాచులు అయిపోయాయి. మొదటి నుంచి బ్యాట్‌ ఝులిపించి ఉంటే ఈసారి కూడా దాదాపు వెయ్యి పరుగులు చేసే అవకాశం ఉండేది' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ విషయంలో ఓపిక అవసరమని అభిమానులకు సూచించాడు. కింగ్స్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ గురించిన మాట్లాడుతూ అనుష్క శర్మను ప్రస్తావించిన గవాస్కర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన విషయం తెలిసిందే.