పెళ్ళికి రెడీ అవుతున్న మరో టాలీవుడ్ యాంగ్ హీరో .?

పెళ్ళికి రెడీ అవుతున్న మరో టాలీవుడ్ యాంగ్ హీరో .?

ఇప్పటికే టాలీవుడ్ లో పెళ్లి బాజాలు బాగా వినిపిస్తున్నాయి. నితిన్ , నిఖిల్ , రానా  ఇప్పటికే ఓ ఇంటివాళ్ళు అయ్యారు . ఇక మెగా డాటర్ నిహారిక కూడా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఇలా వరుస పెళ్లిలతో టాలీవుడ్ లో పెళ్ళికళ కనిపిస్తుంది. తాజాగా మరో యంగ్ హీరో కూడా పెళ్ళికి సిద్దమవుతున్నాడని  తెలుస్తుంది. రొటీన్ లవ్ స్టోరీతో హీరోగా పరిచయమై సందీప్ కిషన్ హిట్లు  ప్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సందీప్ తాను కూడా పెళ్ళికి రెడీ అయ్యానని హింట్ ఇచ్చాడు. ట్విటర్ వేదికగా ఓ పెద్ద అడుగు వేయబోతున్నా అని పేర్కొన్నాడు. ``2020 నా జీవితం గురించి చాలా విషయాలను పునపరిశీలన చేసుకునేలా చేసింది. నన్ను సంతోషపరిచే విషయాలపై ఆలోచించుకునే అవకాశం కలిగింది. నా జీవితంలో తదుపరి పెద్ద అడుగు వేయడానికి నాకు ధైర్యాన్ని సమయాన్ని ఇవ్వండి… బహుశా చాలా ఉత్తేజకరమైన ఆ వార్తను చెప్పేందుకు ఆగలేను.. సోమవారం వరకూ ఆగండి`` అంటూ సందీప్ లేటెస్ట్ ట్వీట్ లో వెల్లడించాడు.దాంతో  ఈ యంగ్ హీరో కూడా పెళ్ళికి సిద్ధమయ్యాడని టాలీవుడ్ కోడైకూస్తోంది..