ఆ ప్రాంతంలో సూర్యోదయం కావాలంటే మరో 65 రోజులు ఆగాలి... 

ఆ ప్రాంతంలో సూర్యోదయం కావాలంటే మరో 65 రోజులు ఆగాలి... 

సూర్యోదయం సూర్యాస్తమయాలు సహజం.  సూర్యాస్తమయాలు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యన జరుగుతుంది.  మరలా సూర్యోదయం ఉదయం జరుగుతుంది.  కానీ, ఆ ప్రాంతంలో సూర్యాస్తమయం బుధవారం మధ్యాహ్నం 2 గంటల మధ్య జరిగింది.  ఇప్పటి వరకు సూర్యోదయం కాలేదు.  మరలా ఆ ప్రాంతంలో సూర్యోదయం కావాలంటే మరో 65 రోజులు ఆగాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు.  సూర్యోదయం 2021 జనవరి 22 వ తేదీన సూర్యోదయం జరుగుతుంది.  అప్పటి వరకు ఆ ప్రాంతం మొత్తం చీకటిగానే ఉండిపోతుంది.  ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?  అమెరికాకు ఉత్తర దిక్కున ఉన్న అలాస్కాలోని ఉట్కియావిక్ ప్రాంతంలో జరిగింది.  అక్కడ ఇలాంటివి సహజమే.  నెలల తరబడి సూర్యుడు కనిపించడు.  ఇలా సూర్యుడు కనిపించకపోవడాన్ని పోలార్ లైట్ అంటారు.