తిరుమలలో సూసైడ్ కలకలం

తిరుమలలో సూసైడ్ కలకలం

తిరుమలలో హైదరాబాద్ కి చెందిన భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వకులామాత అతిథి గృహం  511 లో హైదరాబాద్ కి చెందిన శ్రీధర్ ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడి నారు. తన మేనల్లుడు తో కలిసి దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న శ్రీధర్ నిన్నటి రోజున ఒక్కడే తిరుమలకు చేరుకుని వసతి గదిని పోందారు. స్వామివారిని దర్శించుకొని లడ్డు ప్రసాదాలు సైతం పోందారు. అటు తరువాత వసతి గదికి చేరుకోని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీధర్. వసతి గది తీసుకుని 24 గంటలు అవుతున్నా ఖాళీ చేయకపోవడంతో మొబైల్ ద్వారా సంప్రదించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గది తలుపులు పగలగొట్టి చూడగా శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.