దారుణం : తల్లి, కూతుళ్ళను కొట్టి చంపి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరణ

దారుణం : తల్లి, కూతుళ్ళను కొట్టి చంపి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరణ

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్ పూర్ మండలం షేర్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూత్ పూర్ మండలం షేర్ పల్లి కి చెందిన చెన్నయ్యతో మాధవి అనే మహిళకి 20 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరి సంసారం కొన్నాళ్లు సాఫీగా సాగింది. ఒక కుమార్తె కూడా పుట్టింది. అనంతరం భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో మాధవి (40) తన కుమార్తె మౌనిక (19)తో కలిసి పుట్టింటికి వెళ్ళారు. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ జీవనం సాగించే వారు. ఇటీవల పెద్దలు పంచాయతీ పెట్టి భార్య భర్తల మధ్య రాజీ కుదుర్చడంతో తల్లీ కుమార్తె షేర్ పల్లికి వెళ్లారు. చెన్నయ్య మళ్లీ వేధింపులకు పాల్పడ సాగాడు. ఆదివారం రాత్రి మాధవి వంటగదిలో ఉరేసుకోగా.. గమనించిన కుమార్తె మౌనిక కూడా పక్కగదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అయితే మాధవి భర్త చెన్నయ్య,మరిది కురుమూర్తి కలిసి చంపినట్లు చెబుతున్నారు. పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ప్రజా సంఘాలు ఫిర్యాదు చేసారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.