ఆసక్తి రేపుతున్న సుదీప్ 'కబ్జా' మూవీ స్పెషల్ లుక్!

ఆసక్తి రేపుతున్న సుదీప్ 'కబ్జా' మూవీ స్పెషల్ లుక్!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'కబ్జా' చేస్తున్నాడు. దీనిని ఏడు భాషల్లో విడుదల చేయాలని దర్శకుడు ఆర్. చంద్రు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో కన్నడలో 'బ్రహ్మ', 'ఐలవ్ యు' సినిమాలు వచ్చాయి. అలానే తెలుగులో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సినిమాను కూడా సుధీర్ బాబుతో తెరకెక్కించాడు చంద్రు. ఇప్పుడు ఉపేంద్ర - చంద్ర కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'కబ్జా'కు సంబంధించిన ప్రకటన సంక్రాంతికి వస్తోందంటూ సోషల్ మీడియాలో కొద్ది గంటలుగా హల్చల్ చేస్తూ వచ్చారు. అయితే... ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడింది.  సంక్రాంతి పండుగ సందర్భంగా  కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ లుక్ ని వదిలారు. అందులో 'భార్గవ్ భక్షి' 1947-1986 అని ఉండగా, ఆ పాత్ర సుదీప్ పోషించబోతున్నారు అని ఈ పోస్టర్ బట్టి అర్థమౌతోంది. మాఫియాను అంతం చేసే ఒక పాత్ర అని పోస్టర్ మీద రాసి ఇంకాస్త ఆసక్తిని పెంచింది చిత్రం బృందం. గతంలో హిందీ సినిమా 'ఓ మై గాడ్' కన్నడ రీమేక్ ను ఉపేంద్ర, సుదీప్ కలిసి చేశారు. మరి త్వరలో రాబోతున్న 'కబ్జా'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.