పూరి పాడ్ కాస్ట్ ల పై బన్నీ ప్రశంసలు...

పూరి పాడ్ కాస్ట్ ల పై బన్నీ ప్రశంసలు...

డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి అందరికి తెలుసు. ఆయన సినిమాలో హీరోల మాస్ యాంగిల్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న అభిమానుల‌ను, సినీ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని పూరీ జ‌గ‌న్నాథ్ పాడ్‌కాస్ట్‌ను రూపొందించారు. జీవితం గురించి అందులో చెప్పారు. ఈ క్రేజీ డైరెక్టర్ పాడ్ కాస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరి పోయారు. బన్నీ తన ట్విట్టర్ లో ''పూరి.. ఇందులో చాలా అద్భుతమైన విషయాలు, నిజమైన విషయాలు చెప్పారు. మీ పాడ్‌కాస్ట్‌లు అమేజింగ్. వ్యక్తిగతంగా నాకు చాలా బాగా నచ్చాయి, నా హృదయ పూర్వక ప్రేమ మీకోసం. ఇంకా ఇలాంటి మంచి విషయాలు కావాలి'' అని తెలిపాడు. ఇక బన్నీ ట్విట్ పై  పూరీ జ‌గ‌న్నాథ్ స్పందిస్తూ, ''నేను మీ ట్వీట్ ను చదువుతూ చాలా ఆనందించాను బన్నీ. మీలాంటి యువకుడు నుండి ఇది పెద్ద అభినందన, ఈ రాత్రి నీ కోసం మరో పెగ్ వేస్తా'' అని రిప్లై ఇచ్చారు.