కోహ్లీ రెండులోనే.. కానీ బుమ్రా

కోహ్లీ రెండులోనే.. కానీ బుమ్రా

కరోనా కారణంగా వాయిదా పడిన క్రికెట్ సిరీస్ లు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా రెండో మ్యాచ్ డ్రా గా ముగిసింది.  ఈ రెండో టెస్ట్ ముగిసిన తర్వాత తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ కారణంగా బ్యాటింగ్ టాప్ 10 లో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు. స్టీవ్‌స్మిత్ 911 పాయింట్లతో టాప్‌లో ఉండగా విరాట్ కోహ్లీ 886 పాయింట్లతో రెండో స్థానం లో ఉన్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజామ్ 798 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా భారత ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (766), అజింక్య రహానె (726) టాప్-10లో తమ స్థానాల్ని కాపాడుకున్నారు.

అయితే ఇంగ్లాండ్-పాక్ రెండో టెస్ట్ తో బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మాత్రం మార్పులు వచ్చాయి. ఈ మ్యాచ్ లో  4 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 846 పాయింట్లతో మూడు నుండి రెండవ స్థానానికి వచ్చాడు. అలానే మూడు వికెట్లు పడగొట్టిన జేమ్స్ అండర్సన్ కూడా రెండు స్థానాలు ఎగబాకి 14వ స్థానాన్ని చేరుకున్నాడు. ఇక పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు సాధించడం తో 10 వ స్థానం నుండి 8 కి రాగ 8 వ స్థానంలో ఉన్న భారత పేసర్ బుమ్రా 9 వ స్థానానికి పడిపోయాడు. అయిన కూడా భారత బౌలర్లలో బుమ్రా నే అత్యుత్తమ స్థానం లో ఉన్నాడు.