మ్యాచ్ ఫీజులో బ్రాడ్ కు కోత విధించిన తండ్రి...

మ్యాచ్ ఫీజులో బ్రాడ్ కు కోత విధించిన తండ్రి...

ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్ ఇంగ్లాండ్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో అతనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో బ్రాడ్‌ ఐసీసీ ప్రవర్తన నియమాలను ఉల్లంఘించడంతో మ్యాచ్‌ రిఫరీ అతనికి ఆ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించాడు. అయితే ఆ మ్యాచ్ రిఫరీ బ్రాడ్ తండ్రి క్రిస్‌ బ్రాడ్‌ కావడం గమనార్హం. పాక్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయంలో బ్రాడ్ ఔట్ చేసిన పాక్ ఆటగాడు యాసిర్‌ షా పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు అతనిపై‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని ఆన్ ఫీల్డ్‌ అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. దాంతో రిఫరీ క్రిస్‌ బ్రాడ్ తన కొడుకు స్టువర్ట్‌ బ్రాడ్ కు జరిమాన విధించాడు. ఈ విషయం పై స్టువర్ట్‌ బ్రాడ్ స్పందిస్తూ... ఈ ఏడాది నేను క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చే వారి జాబితాలో మీరు లేరు అని తెలిపాడు.