మొదటిరోజే సిరులు కురిపించిన స్త్రీ

మొదటిరోజే సిరులు కురిపించిన స్త్రీ

బాలీవుడ్ లో హర్రర్ కామెడీ సినిమా స్త్రీ శుక్రవారం రోజున రిలీజయింది.  ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు రివ్యూలు కూడా పాజిటివ్ గా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.  థియేటర్స్ కు ప్రేక్షకులు క్యూ కట్టారు.  హర్రర్ తక్కువగా కామెడీ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు.  దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.  మొదటి రోజు ఈ సినిమా రూ.6.8 కోట్లు వసూలు చేసి మంచి రికార్డు సొంతం చేసుకున్నది.  ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.20 కోట్ల రూపాయల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.