మార్కెట్‌కు దీపావళి కళ

మార్కెట్‌కు దీపావళి కళ

అంతర్జాతీయ మార్కెట్లు ఉరకలెత్తడంతో మన మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టి 172 పాయింట్లు, సెన్సెక్స్‌ 579 పాయింట్ల లాభంతో ముగిశాయి. మార్కెట్‌కు అత్యంత కీలకమైన 10550 స్థాయికి ఎగువన నిఫ్టి క్లోజ్‌ కావడం విశేషం. ఒకదశలో 225 పాయింట్లు లాభపడిన నిఫ్టి క్లోజింగ్‌లో 50 పాయింట్లు కోల్పోయింది. ఇవాళ రికార్డుస్థాయిలో ఆటో రంగ షేర్ల సూచీ 4 శాతంపైగా పెరిగింది. ఫార్మా, ఐటీ షేర్లు ఉదయం నుంచి నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ షేర్లకు చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా క్షీణించాయి. అయితే ప్రైవేట్‌ బ్యాంకులు అండగా నిలవడంతో బ్యాంక్‌ నిఫ్టి సూచీ 1.5 శాతం లాభంతో ముగిసింది. మెటల్‌ షేర్ల సూచీ కూడా మూడు శాతం పెరిగింది. ఇవాళ రికార్డుస్థాయిలో ఒక రూపాయి వరకు లాభపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో వేదాంత, మాఉతీ, బీపీసీఎల్‌ కంపెనీల షేర్లు ఆరు శాతంపైగా పెరిగాయి. టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌ కూడా అయిదు శాతం పైగా లాభంతో క్లోజయ్యాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టెక్‌ మహీంద్రా, విప్రో షేర్లు మూడు శాతం క్షీణించగా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సిప్లా,జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఒక శాతంపైగా నష్టాలతో ముగిశాయి. ఇతర షేర్లలో పీసీ జ్యువల్లర్స్‌ షేర్‌ ఏకంగా 27 శాతంపైగా లాభపడింది. పీఎన్‌బీ 7శాతంపైగా నష్టపోయింది.