భారత బౌలర్లు నన్ను ఔట్ చేయలేరు.. సవాల్‌కి నేను రెడీ: స్టీవ్ స్మిత్

భారత బౌలర్లు నన్ను ఔట్ చేయలేరు.. సవాల్‌కి నేను రెడీ: స్టీవ్ స్మిత్

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. సుమారు మూడు నెలల ఈ సుధీర్ఘ పర్యటనలో కోహ్లీ సేన.. ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు, టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. కరోనా అనంతరం భారత్‌కు ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆసక్తికర పోరు నవంబర్ 27 నుంచి షురూ కానుంది. భారత్‌తో మ్యాచ్ అనగానే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌కి ఎక్కడలేని ఊపు వస్తుంది. మరీ ముఖ్యంగా.. టెస్టు సిరీస్‌లో అతని నుంచి టీమిండియా బౌలర్లకి సవాల్ తప్పదు. అయితే.. ఈసారి అతని బలహీనత ఒకటి వెలుగులోకి వచ్చింది. భారత ఫాస్ట్ బౌలర్ల షార్ట్ పిచ్ ఛాలెంజ్‌కి తాను సిద్ధంగా ఉన్నానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. బౌన్సర్లతో నన్ను ఔట్‌ చేయడానికి ప్రత్యర్థి జట్టు ప్రయత్నిస్తే కొన్నిసార్లు ఫలితం రావొచ్చు. ఎందుకంటే వరుసగా షార్ట్‌ బంతుల్ని శరీరంపైకి విసిరితే ఔట్‌ అవుతుంటారు. కానీ నా కెరీర్‌లో అలాంటి బంతుల్ని ఎన్నో ఎదుర్కొన్నాను. బౌన్సర్లు నన్ను ఒత్తిడికి గురిచేయలేవు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు సమాధానం ఇస్తానని స్టీవ్ స్మిత్ తెలిపాడు.