అలర్ట్ : ఎస్‌బీఐ కస్టమర్లకుహెచ్చరిక

అలర్ట్ : ఎస్‌బీఐ కస్టమర్లకుహెచ్చరిక

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి. అదే సమయంలో మోసాలు పెరిగిపోయాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీలు చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది. ఈ నేపథ్యంలో  మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్ ఫోన్లలో ఉంచకూడదని సూచించింది. బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతుండటంతో స్మార్ట్ ఫోన్లలో బ్యాంకింగ్ పిన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సమాచారం, వాటి పాస్వర్డ్ లు, సీవీవీ నెంబర్ సహ కీలక సమాచారాన్ని దాచి ఉంచితే మోసాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టేనాని హెచ్చరించింది ఎస్బీఐ. అందువల్ల బ్యాంకింగ్ సంబంధింత కీలక సమాచారాన్ని తక్షణమే ఫోన్ లో నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది ఎస్బీఐ.