చిరంజీవితో చేతులు కలపనున్న స్టార్ హీరో !

చిరంజీవితో చేతులు కలపనున్న స్టార్ హీరో !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' సినిమాలో పలువురు స్టార్ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే.  వారిలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడ ఉన్నారు.  తమిళనాట వరుస సినిమాలు చేస్తూ, ఏకధాటిగా విజయాలను అందుకుంటూ హాట్ ఫెవరెట్ గా ఉన్న విజయ్ 'సైరా' సినిమాలో నరసింహారెడ్డి అంగరక్షకుడు, అనుచరుడు అయిన ఓబయ్య పాత్రను చేయనున్నారు.  

తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే సినిమా షూటింగ్లో జాయిన్ అవుతానని అన్నారు.  సేతుపతి నటిస్తుండటంతో ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో కూడ భారీ అంచనాలు నెలకొన్నాయి.  సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ పిరియాడికల్ మూవీని రామ్ చరణ్ భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు.